Posted on 2025-09-24 12:48:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్బంగా డెఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాదు వారు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వ్యక్తుల మధ్య సంభాషణకు భాష అవసరం.అలాంటి భాషను వినాలేని, మాట్లాడలేని బధిరులకు సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఆవిర్భవించిందే సంకేత భాష విధానం అన్నారు. బాడీ లాంగ్వేజ్, శరీర కదలికలు, కనుబొమ్మలను కదపడం, ముఖ కవళికల ద్వారా ఎదుటి వ్యక్తితో సంభాషణ చేసే నైపుణ్యాన్ని సంకేత భాష అందిస్తుందని వేళ్లు లేదా చేతి సంజ్ఞల ద్వారా మనసులోని భావాలను వ్యక్తపరచడం గొప్ప విషయం అన్నారు. 2018 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మొదటిసారిగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహించిందని ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం యొక్క థీమ్ "సంజ్ఞా భాష హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు". అన్నారు.
సంజ్ఞా భాషను ఉపయోగించే వారి హక్కును గుర్తించకుండా మద్దతు ఇవ్వకుండా బధిరుల హక్కులను పూర్తిగా సాధించలేమని ఈ థీమ్ నొక్కి చెబుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సౌందర్య, భూపతి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు. సౌందర్య, భూపతి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >