Posted on 2025-09-24 09:22:43
అనుమతులు లేని కంపెనీల పేరిట ప్రజలను మోసం చేస్తున్న ముఠా..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అనుమతులు లేని కంపెనీల పేరుతో అమాయక ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి పేర్కొన్నారు. సీసీఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.2022లో శ్రేమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్ (32) ఓ సంస్థను కొంతమంది మిత్రులతో కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు.
అత్యధికంగా వడ్డీని ఇప్పిస్తామంటూ డిపాజిట్లను భారీమొత్తంలో స్వీకరించారు. వీరిచేతిలో మోసపోయిన ఇందల్వాయికి చెందిన ఉపాధ్యాయుడు హకీం ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా 2022 నుంచి ఇప్పటివరకు సుమారు 125 మందిని చీట్ చేసి వారి వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించారు. దేశవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల వసూలు చేశారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >