Posted on 2025-09-21 09:50:04
విద్యాసంస్థ చేసే ఇబ్బందులకు విద్యార్థులు తాళలేక సంవత్సరానికి ఒక్కరు ఇబ్బందుల పాలు..
విద్యాసంస్థ భవనం పై నుండి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ విద్యార్థి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. విద్యార్థి సంఘాల ఆందోళన
విద్యార్థి పరిస్థితి విషమం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ర్యాంకుల సాధన కోసం ఏమీ తెలియని పసి విద్యార్థుల ను సంవత్సరానికి ఒకరు చొప్పున టార్గెట్ చేస్తూ బలి తీసుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థలు. తాజాగా నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పాలాజీ, శిల్పల కుమారుడు సుమిత్ ఈ సంవత్సరం కాకతీయ విద్యాసంస్థలు 8వ తరగతిలో విద్యభ్యాసం కోసం ఈ సంవత్సరం విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించారు. అయితే ఈ శుక్రవారం ఎస్ఏ1, ఎస్ఏ 2 పరీక్షలు పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ పరీక్షలు సదరు విద్యార్థి మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారంటూ క్లాస్ రూమ్ లో ఉన్న టీచర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్దకు విషయం తీసుకెళ్లారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని మందలించడంతో తీవ్ర మణస్థాపంతో పాఠశాల భవనం రెండవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక్కడి నుంచి మొదలైంది. ఆ విద్యాసంస్థ యొక్క నాటకీయ పరిణామం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని బయటకు రానివ్వకుండా జాగ్రత్తగా వహించి ఎవరికీ తెలియకుండా వారి తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన వారి తల్లిదండ్రులు మానసికంగా తీవ్రంగా కుంగి పోయారు. బయటకు పొక్కకుండా చూడాలని అవసరమైతే విద్యార్థి చికిత్స నిమిత్తం అవసరమైన ఖర్చు తామే భరిస్తామని నచ్చచెప్ప సాగారు దీంతో విద్యార్థి తల్లి విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త వహించారు. చివరకు విషయం ఆదివారం మధ్యాహ్నం బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. కాగా
దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు వెల్లడించారు. రెండవ అంతస్తు నుండి కిందికి దూకడంతో విద్యార్థి కాలు విరిగిపోగా, తలకు, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో బాబుకు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత పోలీసులను వివరణ కోరగా విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరోసారి విచారణ జరుపుతామని చెప్పడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావు కల్పిస్తుంది. పాఠశాల యజమాన్యాన్ని కాపాడేందుకే విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం పై పోలీసులు సీరియస్ గా పరిగణించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే విద్యా సంస్థలు గత సంవత్సరం కూడా ఓ విద్యార్థి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యంతో బోధన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంటారో పాఠశాల యాజమాన్యమే సమాధానం చెప్పాలి.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >