Posted on 2025-09-19 21:16:13
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:సమాజంలో అన్ని దానాలకన్నా విద్యా దానం అత్యున్నతమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) శివారులో, శుక్రవారం నిజామాబాద్ జిల్లా ట్రస్మా (ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం సందర్భంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత సమాజంలో గురువులను పూజిస్తారని,
భావి భారత పౌరులను తీర్చిదిద్దే నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భూదానం, గో దానం, అన్నదానం చేసినా, అన్నిటికన్నా గొప్పది విద్యాదానం అని పేర్కొన్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖకు 22 వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించిందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారని, తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపిస్తున్నారని, మార్కులు – ర్యాంకులు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వ వికాసం కలిగేలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. తరగతి గదుల్లో ప్రతిభావంతులతో పాటు బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులు కూడా ఉంటారని, వారిని సమూహ చర్చల ద్వారా ప్రోత్సహించి తెలివితేటలు పెంచేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్, రజినీకాంత్, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >