| Daily భారత్
Logo




పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ద్వారానే సాధ్యం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2023-12-28 13:28:41

Share: Share


పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ద్వారానే సాధ్యం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ద్వారానే సాధ్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... భారత జాతీయ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆనాడు 72 మంది తో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కీలకపాత్ర వహించింది కాంగ్రెస్ అని అన్నారు. ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యి కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారని తెలిపారు. ఒకవైపు ప్రజలు కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలు ప్రజలు మరవలేరన్నారు. 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తి గల దేశంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు.. కాంగ్రెస్ పార్టీ 139 ఏళ్లుగా ఈ దేశంలో ఒక పటిష్టమైన పార్టీగా నెలదొక్కుకుందంటే ఆ పార్టీ మూల సిద్ధాంతాలు.. పార్టీలోని నాయకులు,కార్యకర్తలు కారణమన్నారు.తేలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను తీర్చినా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అయ్యిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామన్నారు..

Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >