| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన సిరిసిల్ల సీఐటీయూ నాయకులు

జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన సిరిసిల్ల సీఐటీయూ నాయకులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వినతి పత్రం.

ఈరోజు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు మోర తిరుపతి కలిసి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమను అభివృద్ధి పరచడానికి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే కొరకు కృషి చేస్తానని ప్రభుత్వానికి సంబంధించిన వస్త్రాలను అన్నిటిని పవర్లూమ్ లపై ఉత్పత్తి చేయిస్తామని సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా చూస్తామని బతుకమ్మ చీరలకు రావలసిన పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు

Previous రాములవారి తలంబ్రాల ఊరేగింపు
Next ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్లు
ADVERTISEMENT