Posted on 2025-07-12 17:46:15
డైలీ భారత్, వరంగల్: నేర నిరోధం లోగాని, విచారణలో గాని ఫోరెన్సిక్ నిపుణులు సమాజానికి ఎంతో సహాయకారిగా ఉండి వారి సేవలను అందిస్తారని తెలంగాణ ఫోరెన్సిక్ మెడిసిన్ జనరల్ సెక్రెటరీ మరియు కాకతీయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ లక్ష్మణరావు అన్నారు.
కాకతీయ వైద్య కళా శాల ఎన్ఆర్ ఐ భవన్లో రెండు రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు ముగింపు ఆదివారం సాయంత్రం జరిగింది. ముగింపు ఉపన్యాసం చేస్తూ డాక్టర్ లక్ష్మణ్ రావు... నేరం జరిగిన ప్రదేశం లో ఆధారాల సేకరణ, నేర సంబదీకుల భౌతిక ఆధారాల సేకరణ, కోర్టుల్లో జరిగే విచారణ ప్రక్రియలో సహాయం అందించడం ద్వారా ఫోరెన్సిక్ వైద్యులు తమ సేవలను సమాజానికి అందిస్తారన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నేరాలను నిరోధించే ప్రక్రియలో కూడా ఈ నిపుణులు తమ సేవలను అందిస్తారని కొనియాడారు. రెండు రోజులపాటు జరిగిన చర్చ సమావేశాల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్న వైద్యులు తమ సేవలను మరింతగా అందించాలని పిలుపునిచ్చారు.
సదస్సుల్లో కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, ఫోరెన్సిక్ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అభిజిత్ సుబేదా, ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యవిభాగాధిపతి డాక్టర్ శ్రీధరరాచారి, గాంధీ ఆస్పత్రి వైద్య విభాగాధిపతి డాక్టర్ కృపాసింగ్, మేజర్ డాక్టర్ నవీన్, కాకతీయ మెడికల్ కళాశాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్లు పాల్గొన్నారు. అనంతరం ఫోరెన్సిక్ డాక్టర్ల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >