| Daily భారత్
Logo




ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2025-07-12 17:17:20

Share: Share


ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్న ప్రభుత్వం.. కులగణన పేరుతో ఆరు నెలల పాటు కాలయాపన ఎందుకు చేసిందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర సర్కార్.. బీసీ కమిషన్ పేరు చెప్పి కొంతకాలం, డెడికేటెడ్ కమిషన్ పేరుతో మరికొంతకాలం, ఢిల్లీకి బిల్లు పంపి ఇంకొంత కాలం సమయం గడిపిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి లేకే ఇలా చేస్తూ వస్తున్నదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కాలయాపనకే రేవంత్ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు న్యాయస్థానాల ముందు నిలబడబోవని స్పష్టంచేశారు. ప్రభుత్వ అసంబద్ధ, గందరగోళ నిర్ణయాలతో తెలంగాణ బీసీ వర్గాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఢిల్లీకి వెళ్లినపుడు కనీసం ఒక్కసారైనా బీసీ బిల్లు గురించి ప్రధానితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. తన సీటును కాపాడుకునే ప్రయత్నం తప్ప, రేవంత్ రెడ్డికి బీసీల సమస్యలు పరిష్కరించడంపై లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకునేందుకు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >