| Daily భారత్
Logo




ప్రాథమిక పాఠశాలలకు పదివేల PSHM పోస్టులు కేటాయించి, B,Ed, D,Ed,. సమాన అర్హతగా SGT లకు పదోన్నతులు కల్పించాలి

News

Posted on 2025-07-11 19:52:08

Share: Share


ప్రాథమిక పాఠశాలలకు పదివేల PSHM పోస్టులు కేటాయించి, B,Ed, D,Ed,. సమాన అర్హతగా SGT లకు పదోన్నతులు కల్పించాలి

పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గత కేబినెట్ లో తీర్మానించిన 700 కోట్ల నిధులు విడుదల చెయ్యాలి

PRC వెంటనే ప్రకటించాలి

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:PSHM పోస్టులు ప్రాథమిక  పాఠశాలలకు కేటాయించి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకినాలా అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. టి.పి.టి.ఎఫ్  ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడానికి ఉపాధ్యాయులనే నియమించడం మానుకొని, పర్యవేక్షణ పోస్టులు మంజూరు చేసి, పర్యవేక్షణ అధికారుల నియామకం చేయాలని డిమాండ్ చేశారు. విద్యను విధ్వంసం చేసే విధానాలను మానుకొని, అందరికీ సమాన విద్యను ప్రభుత్వమే అందించాలని అన్నారు. రెండు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న అన్ని రకాల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించకుండా, ఉద్యోగుల నుండి అమౌంట్ సేకరించడం ఇదోరకమైన మోసం అని అన్నారు. ఉద్యోగులు పొదుపుచేసుకున్న జిపీఫ్, టీజిఎలైసి మొత్తాల నుండి ఇవ్వాళ లోనులు పార్టీ ఫైనల్స్ పొందలేని పరిస్థితులున్నాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం PRC ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు KGBV ఉపాధ్యాయుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, వారిని తక్షణమే రి ఆర్గనైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు

రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి గారు  మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులు సింహ భాగంగా పనిచేయాలి, అంతరాలు లేని సమాజం కోసం ఫెడరేషన్ కార్యకర్తలు విధులు నిర్వహించాలి.  అందరికీ సమాన విద్యను అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తేనే అన్ని స్కూల్లు బాగుపడుతాయని అన్నారు. ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తే, ఉపాధ్యాయులు ఉద్యమాల్లో ఉంటారని అన్నారు. విద్యారంగా సమస్యలు పరిష్కరించాలంటే ఉద్యమం ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు. ఒక వర్గానికి అనుగుణంగా ఉండే విధంగా తయారుచేస్తున్న విద్యా ప్రణాళికలను నిలిపివేసి, అన్ని జాతుల అభివృద్ధి కోసమా ఉపయోగపడే విద్యను ప్రభుత్వాలు అందించాలని అన్నారు.

ప్రయివేట్ స్కూల్లలో ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా, ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులతో పర్యవేక్షణ చేయించడం సరైన విధానం కాదని అన్నారు.

జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుమాల రమానాధ్ రెడ్డి, విక్కుర్తి అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 10 వేల ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి, యస్ జీ టీలకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేండ్లులుగా పెండింగులో ఉన్న వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన వారికి సర్వే అమౌంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని , 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమించబడ్డ DSC 2003 ఉపాధ్యాయులకు మెమో 57 ను అమలు చేసి OPS పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు.కేజిబీవి సిబ్బందికి చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నైట్ డ్యూటీ చేసిన సిబ్బందిని ఉదయం 7 గంటలకు రిలీవ్ చెయ్యాలని అన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, సమ్మేకలపు వేతనం వెంటనే విడుదల చెయ్యాలని అన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ శాస్త్రియంగా చేపట్టి, అవసరమున్న పాఠశాలలకు మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించాలని  డిమాండ్ చేశారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉన్న టైమ్ టేబుల్ సమస్యను పరిష్కరించాలని కోరారు.


ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు దబ్బెడ హన్మండ్లు, మందాడి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల కృష్ణ చైతన్య, నూగురి దేవేందర్, జిల్లా కార్యదర్శులు మైలారం తిరుపతి,  పార్వతి తిరుపతి, చకినాల రామచంద్రం, జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ బుస రాజేందర్, మండలాల బాధ్యులు, శ్రీధర్, తాటికొండ సంజీవ్, జగిత్యాల శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్ ,  బొజ్జ కృష్ణ, బాలరాజు, శ్రీరామోజు శ్రీనివాస్, మధుసూదన్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, చకినాల భాస్కర్, శ్రీనివాస్ రాజు, రమేష్ రెడ్డి, పాల్గొన్నారు...

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >