| Daily భారత్
Logo




జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

News

Posted on 2025-07-11 19:47:08

Share: Share


జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

సిరికొండ మండలం తాటిపల్లి లో పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా అడవిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సిరికొండ మండలం తాటిపల్లి అటవి ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం ఆర్మూర్ ఎఫ్ డి ఓ భవానీ శంకర్, సిరికొండ ఇంచార్జ్ ఎమ్ ఆర్ ఓ రవిందర్ అటవి అధికారులు తాటిపల్లి అడవిలో పులి సంచరించిన ప్రాంతంలొ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవి అధికారులు పాదముద్రలను పరిశీలించి పులి సంచారం నిజమేనని తెల్పారు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతం నుంచి పులి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం ఉండేది. చివరగా 1997 లొ ఒకసారి, 2000 సంవత్సరంలో రెండోసారి పులి సంచరించినట్లు అటవి అధికారులు తెలిపారు. సిరికొండ అటవి ప్రాంతంలో పులి సంచారం స్థానికులలో ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ఆటవీ ప్రాంతం రోజు రోజుకు క్షీణించి పోతుండగా చిరుత పులి, ఎలుగు బంట్లు లాంటి వణ్య ప్రాణుల సంచారం ఉంది. కాని తొలిసారి రెండు దశాబ్దాల తర్వాత పులి సంచారం వాస్తవమేనని ఆర్మూర్ ఎఫ్ డి ఓ భవానీ శంకర్ తెలిపారు. పాదముద్రల ద్వారా అంచనా వేసినట్లు ఇటివల కాలంలో రాజన్న సిరిసిల్ల అటవి ప్రాంతంలో పులి కదలికలు ట్లు సమాచారం ఉందని తెలిపారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >