| Daily భారత్
Logo




44 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

News

Posted on 2025-07-08 14:59:07

Share: Share


44 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఒకేసారి మూడు కార్లను ఢీకొన్న లారీ.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జాతీయ రహదారిపై 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి  వద్ద ఓ లారీ మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

ఇందల్వాయి మండలం  చంద్రాయన్​పల్లి వద్ద మంగళవారం సాయంత్రం నిమాబాద్​ వైపు నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక వైపు ముందు వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. అంతేకాకుండా.. కార్లను ఢీకొని లారీ ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన మరో లారీ దానిని ఢీకొట్టింది. అలాగే ఈ ఘటనలో ఓ బైకుపై వెళ్తున్న వారు సైతం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు భారీగా  ధ్వంసం అయింది.

కాగా.. ఒక కారు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఇందులో ఉన్న కామారెడ్డికి వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మరో కారులో హైదరాబాద్​ వెళ్లే కారు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు దంపతులకు గాయాలవడంతో అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. వీరు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామానికి చెందిన వారిని సమాచారం. భారీ ప్రమాదం జరగడంతో రోడ్డుపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్​ జాం ఏర్పడింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >