| Daily భారత్
Logo




చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి : డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్

News

Posted on 2025-07-08 16:33:29

Share: Share


చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి : డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: చట్టాలపై సంపూర్ణమైన అవగాహన పెంచుకునేందుకు ప్రతి మహిళా ముందుకు రావాలనీ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు.

మంగళవారం గోపాల్ నగర్ లోని పంచాయతీరాజ్ అతిధి గృహ సముదాయంలోని సమావేశ మందిరంలో డీఎల్ఎస్ఏ చేర్మెన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. నీరజ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా జైస్వాల్ మాట్లాడుతూ ఇంటా బయటా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళల భద్రత, సంక్షేమం కోసం రూపొందించబడిన పలు మహిళా చట్టాల్లోని కీలకాంశాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. గృహ హింస, వరకట్న నిషేధం, బాల్య వివాహాలకు సంబంధించిన చట్టాలను ప్రస్తావించారు. సర్దుకుపోలేని సమస్యల కారణంగా కుటుంబంలోని కలతల్ని. దంపతుల మధ్య సర్దుబాటు లేమి వంటి సమస్యలను తమ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవచ్చునన్నారు. స్త్రీ. పురుష సమానత్వ సాధన ప్రక్రియలో ముందుకు సాగుతున్న తరుణంలో వివక్ష ఏ స్థాయిలో ఉన్నా చట్టం నుంచి రక్షణ పొంద వచ్చునన్నారు. అదే సమయంలో చట్టం కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసే వారి విషయంలోనూ న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ సమస్వయంతో జరిగిన ఈ సమావేశంలోల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్సభ్యులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, న్యాయవాదులు ఇ. జ్యోతి, కె. తిరుపతి, అలేఖ్య, ఆర్ అరుణ, గెంట్యాల భూమేశ్ తదితరులు మాట్లాడారు. 19వ వార్డుకు సంబంధించిన సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు.


Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >