| Daily భారత్
Logo




ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు.. చిన్నారుల మృతి

News

Posted on 2025-07-08 09:59:03

Share: Share


ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు.. చిన్నారుల మృతి

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. రైలు వెళ్లే సమయానికి గేటు వేయకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటినా రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే గేట్ కీపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >