| Daily భారత్
Logo




పుణె రేప్ కేసు.. అదంతా కట్టుకథేనని తేల్చిన పోలీసులు

News

Posted on 2025-07-07 18:53:12

Share: Share


పుణె రేప్ కేసు.. అదంతా కట్టుకథేనని తేల్చిన పోలీసులు

వచ్చింది డెలివరీ బాయ్ కాదు.. టెకీ స్నేహితుడే

ఆమె అనుమతితోనే ఇంటికి వచ్చిన స్నేహితుడు

స్ప్రే చల్లి మత్తులోకి నెట్టారన్న ఆరోపణలు కట్టుకథగా వెల్లడి

సెల్ఫీ, బెదిరింపు మెసేజ్‌లు.. అంతా యువతి సృష్టించిన నాటకమే

యువతిపై చర్యలు తప్పవన్న పోలీసులు

డైలీ భారత్, పూణే: పుణె నగరంలో తీవ్ర కలకలం రేపిన ఐటీ ఉద్యోగిని అత్యాచార కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యువతి చేసిన రేప్ ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేలా ఉందని పోలీసులు తేల్చారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులోని గుట్టును రట్టు చేసి, అసలు నిజాలను బయటపెట్టారు.

వివరాల్లోకి వెళితే.. కొంధ్వా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఐటీ ఉద్యోగిని తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెలివరీ ఏజెంట్ రూపంలో వచ్చిన ఓ వ్యక్తి, తనపై రసాయన స్ప్రే చల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెళ్లే ముందు తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని, ఈ విషయం బయటపెడితే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపు సందేశం టైప్ చేశాడని కూడా తెలిపింది.

ఈ తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులకు.. ఆమె చెప్పిన కథనానికి, వాస్తవానికి పొంతన లేదని తేలింది. నిందితుడిగా చెప్పిన వ్యక్తి డెలివరీ ఏజెంట్ కాదని, ఆమెకు ముందే పరిచయమున్న స్నేహితుడని గుర్తించారు. ఆమె అనుమతితోనే అతను ఫ్లాట్‌కు వచ్చాడని, బలవంతంగా ఇంట్లోకి చొరబడలేదని నిర్ధారించారు.

ఈ విషయంపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ, "యువతి చేసిన ఫిర్యాదు పూర్తిగా కల్పితం. ఎలాంటి రసాయన స్ప్రే వాడలేదు, అత్యాచారం జరగలేదు. ఆమె స్నేహితుడు ఆమె సమ్మతంతోనే ఫ్లాట్‌కు వచ్చాడు. బెదిరింపు సందేశాన్ని యువతే స్వయంగా టైప్ చేసుకుంది" అని వెల్లడించారు. తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు యువతి విచారణలో చెప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పుణె నగర భద్రతపై తప్పుడు ప్రచారాలు జరిగాయని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >