| Daily భారత్
Logo




ఆడుతూ రెండు రూపాయల కాయిన్ మింగేసిన బాలుడు

News

Posted on 2025-07-06 17:21:15

Share: Share


ఆడుతూ రెండు రూపాయల కాయిన్ మింగేసిన బాలుడు

ఆందోళనలతో ఆస్పత్రికి తరలించిన తల్లిదండ్రులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇంట్లో ఆడుకుంటూ ఓ బాలుడు కాయిన్​ మింగేశాడు.. తీరా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడిని తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు.

ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట  మండలం లింగంపల్లి కుర్దుకు చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన రెండేళ్ల తన్వీర్​ ఇంట్లో ఆడుకుంటుండగా.. రెండు రూపాయల కాయిన్​ మింగేశాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే లింగంపేట్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్​రే తీయగా కాయిన్ మధ్యలో ఇరుక్కుందని చెప్పారు. వెంటనే కామారెడ్డి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. కుటుంబ సభ్యులు బాలుడిని కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యులు ఆధునిక పరికరాలతో బాలుడి గొంతులో ఇరుక్కున్న కాయిన్ తొలగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >