Posted on 2025-06-27 16:49:35
తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసిన బచ్చల లక్ష్మయ్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ 117 సర్వే నెంబర్ ( సీలింగ్ ల్యాండ్ ) ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా భూ పట్టాలు పొందడం, నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున జరుగుతున్న తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ శ్రీనివాస్ కు ఆదివాసీ సంఘం నేత, గ్రామీణ పేదల సంఘం ముఖ్య నాయకులు బచ్చల లక్ష్మయ్య శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుండెపుడి రెవెన్యూ ప్రభుత్వ భూమిలో ( సిలింగ్ ల్యాండ్ ) కొందరు గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మార్వోల ప్రమేయంతో ఏజెన్సీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా భూ పట్టాలు పొందారని ఆరోపించారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలు అమలులో ఉండగా, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా పట్టా చేయడం పట్ల ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ భూమిని పట్టా చేయటం, నిబంధనలకు విరుద్ధంగా భూ హక్కు పత్రం పొందిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక అక్రమంగా ప్రభుత్వ భూమికి హక్కుపత్రం పొంది, అదే ప్రాంతంలో మైనింగ్ శాఖ నుంచి భూ తవ్వకాలకు అనుమతులు పొందడం కూడా ఏజెన్సీ ప్రాంతంలో చట్ట విరుద్ధమేనని ఆయన వ్యక్తం చేశారు. పెద్దపెద్ద యంత్రాలతో తరాలనాటి ఎత్తైన గుట్టలను తవ్వుతున్నారని, పెద్ద ఎత్తున క్వారీలు పెట్టి మట్టిని తరలిస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. గుట్టలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏళ్లనాటి వృక్ష సంపదను కూడా కొల్లగొడుతూ, పర్యావరణ విధ్వంసానికి కొందరు వ్యక్తులు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి కూడా వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. స్పందించిన ఉన్నతాధికారులు సర్వే నంబర్ 117 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమాలు, పర్యావరణ విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేసి, సమగ్ర విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ మేరకు జూలూరుపాడు తహసిల్దార్ కు కూడా వినతిపత్రం అందజేసి, గుండెపుడి రెవిన్యూ సీలింగ్ ల్యాండ్ లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేసి, ప్రభుత్వ భూమితో పాటు పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >