| Daily భారత్
Logo




సూర్యాపేట జిల్లాను డ్రగ్ రహీత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

News

Posted on 2025-06-26 15:23:01

Share: Share


సూర్యాపేట జిల్లాను డ్రగ్ రహీత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాను డ్రగ్ రహీత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని మెడికల్ కాలేజీ నుండి నిర్వహించిన ర్యాలీని ఎస్పీ నర్సింహ, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మెడికల్ కాలేజ్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా సద్దల చెరువు వద్దకు డ్రగ్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ సాగింది. అసదుల చెరువు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా విద్యార్థులతో మాదకద్రవ్యాల జోలికి వెళ్ళమని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ సమాజంపై మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిమానాలపై ప్రజలు అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని దీనివల్ల తల్లిదండ్రులు కుటుంబాలు బాధపడుతున్నారని, విద్యార్థులు మంచి స్నేహితులతో, క్రమశిక్షణతో, ఆరోగ్యవంతంగా ఉండాలని, మనకు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని వాటి వలన దుష్ప్రభావాలకు లోను అవుతామని, తప్పుదారిలో పడకుండా మనమందరం ఆరోగ్యంగా ఉంటూ ఆటపాటలతో ఆనందంగా ఉండాలని కలెక్టర్ యువతకు సూచించారు .జిల్లాలో ఎస్పీ టీమ్స్ అన్ని కళాశాలల వద్ద నిగా పెట్టారని ఏ చిన్న అనుమానం వచ్చినా అట్టివారిని అరెస్టు చేస్తారని తెలిపారు. యువత కూడా గంజాయి ,డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు కనిపించినప్పుడు వెంటనే 1908 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని లేదా 100 డయల్ చేసి వివరాలు తెలపాలని వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సూర్యాపేట జిల్లా అన్ని రంగాలలో ముందుండాలని యువత అన్ని ఉద్యోగాలలో రాజకీయాలలో ఆటలలో అన్ని రంగాలలో సూర్యాపేట జిల్లా ముందుండాలని ఆ విధంగా యువత కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు మిషన్ పరివర్తనలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి విజయవంతం చేసినందుకు కలెక్టర్ అన్ని కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. యువత మీ చదువుపై మీ బంగారు భవిష్యత్తు దృష్టి పెట్టి మీ లక్ష్యం వైపు నడవాలని కలెక్టర్ సూచించారు.

రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం ,వాడకం, రవాణా, అరికట్టడం అలాగే అంతర్జాతీయ మార్గద్రవ్యాల నిర్మూలన దినోత్సవంలొ పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు మన ప్రాంతాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని డ్రగ్ రైత ప్రాంతాలుగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు కొంతమంది యువతులు కొత్త ఆనందాల కోసం వీటి బారిన పడుతున్నారని కొందరి స్వార్థపూరిత వ్యాపారం వల్ల వారు సమాజంపై విషం చెబుతున్నారని యువతకు చాక్లెట్లు సిగరెట్ల రూపంలో అందుబాటులోకి వస్తున్నాయని దీనికి బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు మీకు అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908కి చెప్పాలని అందరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారని కఠినమైన చట్టాలను పెట్టారని టూరిజం చైర్మన్ తెలిపారు మన సూర్యాపేట జిల్లాను డ్రగ్ రహీత ప్రాంతంగా తీర్చిదిద్దాలని దీని కొరకు అందరం కలిసి ఉద్యమించాలని తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా అదనప కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను గ్రహీత జిల్లాగా చేద్దామని దీనిలో అందరం భాగస్వాములు అవుదామని వారు కోరారు డ్రగ్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందమైన జీవితాన్ని కూడా బలి తీసుకుంటుందని డ్రగ్స్ కలిగి ఉండడం నేరం అందుకు చట్టరీత్యా శిక్ష తప్పదని డ్రగ్స్ ని తరిమికొడదాం యువతని కాపాడుదాం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు అమ్మేవారు కానీ వారి గురించి గానీ ఎటువంటి సమాచారం తెలిసిన తెలంగాణ యాంటీ నార్కో పిక్స్ బ్యూరో హెల్ప్ లైన్ నెంబర్ 1908 కి కాల్ చేసి తెలపాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. "నో టు డ్రగ్- ఎస్ టు లైఫ్" అంటూ ఎస్పి విద్యార్థులతో నినాదాలు చేయించారు. యువత డ్రగ్స్ తో పాటు గుట్కా, గంజాయి మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆలోచన విధానం ఆలోచన శక్తి నశిస్తాయని వారు తెలిపారు. డ్రెగ్ కు వ్యతిరేకంగా, డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు గోడపత్రికలను ఆవిష్కరించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు.

 ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిడబ్ల్యుఓ రూప , ఆర్డీవో వేణుమాధవ్, తాసిల్దార్ కృష్ణయ్య, డీటీడీవో శంకర్ ,డివైఎస్ఓ రామచంద్రరావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి ప్రసన్న కుమార్, నరసింహ చారి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >