Posted on 2025-06-10 07:39:57
డైలీ భారత్, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆరో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయాందోళన చెందిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో 8 ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. మంటల్లో ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ ప్రజలను కలవరపెడుతన్నాయి. ఇటీవలే ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు యువకులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఇందులో మరో నలుగురికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >