| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ కంటే ముందు ఈడీనే కేటీఆర్‌కు నోటీసులు

ఏసీబీ కంటే ముందు ఈడీనే కేటీఆర్‌కు నోటీసులు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. కేటీఆర్ కు ఇంకా నోటీసులు జారీ చేయలేదు. కానీ ఏసీబీ కేసు ఆధారంగా కేసు పెట్టిన ఈడీ మాత్రం ఆగడంలేదు. వెంటనే నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈనోటీసులు అందాయి. వీరిని ముందే రావాలని ఆదేశించింది. జనవరి 2, 3 తేదీల్లో వీరు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ.. పెమా నిబంధనలు ఉల్లగింన జరిగినట్లు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ కేసు పెట్టింది.

తెలంగాణ ఏసీబీ పెట్టింది అవినీతి కేసు. అక్కడ అవినీతి లేదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈడీ పెట్టింది డబ్బుల అక్రమ తరలింపు కేసు . కేటీఆర్ ఇలా తరలిపోయిందని అంగీకరిస్తున్నారు. అయితే తనకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయాన్ని ఈడీ తేలుస్తుంది. మొత్తంగా ఏసీబీ కన్నా ఈడీనే దూకుడుగా ఉండటం బీఆర్ఎస్ క్యాంప్‌నకు ఆందోళన కలిగించేదే.

Previous యువత చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి : తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి
Next పేదల పెన్నిధి జనార్దన్ రెడ్డిని ప్రజలు మరువరు : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT