Posted on 2024-10-29 08:54:26
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా కి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ కి యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ -2024 యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిధి తెలంగాణా ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ విసి. సజ్జనార్ ఐ పి ఎస్ అందించటం జరిగిందని క్లబ్ అధ్యక్షులు జె.బాలు తెలిపారు.
ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ కానిస్టేబుల్ రాజశేఖర్ యువ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేస్తూ యువత ను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తూ రక్త శిబిరాలు నిర్వహించడం, యువత ను రక్త దానం వైపు ప్రోత్సహించటం, యువత కు పోలీస్ మరియు ఆర్మీ కోసం ఉచిత ఫిజికల్ శిక్షణ ఇస్తూ, యువత ను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు గాను ఈ అవార్డు అందిచటం జరిగింది అని తెలిపారు.
ఈ సందర్బంగా కానిస్టేబుల్ రాజశేఖర్ మాట్లాడుతూ నేను చేస్తున్న సేవలు గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వటం హర్షనీయం అని, తనకు సహకరిస్తున్న ఉన్నతధికారులకు, యువ ఫౌండేషన్ అభ్యర్థుల కు మరియు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >