| Daily భారత్
Logo




ఏసీబీ వలకు చిక్కిన బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్, ఆస్తి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్.

News

Posted on 2023-11-08 23:30:58

Share: Share


ఏసీబీ వలకు చిక్కిన బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్, ఆస్తి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్.

డైలీ భారత్, బాన్సువాడ: బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు. డాక్యుమెంట్ల కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాన్సువాడ డివిజన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాన్సువాడ పట్టణానికి చెందిన ఉమామహేశ్వర్ తన తండ్రి పేరుపై ఉన్న పాత ఇంటి మ్యుటేషన్ సర్టిఫికెట్, ముగ్గురు అన్నదమ్ములకు పంపకం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకై సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లారు.ఏదో కారణం చెప్పి ఇందులో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు తెలుపగా, ముగ్గురిపై రిజిస్ట్రేషన్ కావాలంటే పదిహేను వేలు ఇవ్వాలంటూ సబ్ రిజిస్టర్ డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని, తమ తండ్రి ఆస్తిని తాము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామని అందుకు పత్రాలు చూసి రిజిస్టర్ చేయాలని కోరగా రూ.15 వేలు ఇస్తేనే రిజిస్టర్ చేస్తానని చెప్పడంతో, చేసేదేం లేక అక్టోబర్ 16న ఉమామహేశ్వర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.

కేసు నమోదు

ఏసీబీ అధికారుల సూచన మేరకు బుధవారం మధ్యాహ్నం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లిన ఉమామహేశ్వర్ తన వద్ద డబ్బులు లేవని వివరించగా... సరే రూ.9 వేలు కచ్చితంగా ఇవ్వాలని సబ్ రిజిస్టర్ డిమాండ్ చేశాడు. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది యూనిస్ కు రూ. 9 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాయంత్రం వరకు కార్యాలయంలో వివిధ సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ ను పట్టుకున్నారని సమాచారం తెలియడంతో బాన్సువాడ పట్టణంలో ఉన్న రైటర్లు, బ్రోకర్లు వారి కార్యాలయాలకు తాళాలు వేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. సబ్ రిజిస్టర్ సతీష్ కు సహకరించిన సిబ్బందిపై సబ్ రిజిస్టర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఎస్సైలు శ్రీనివాస్, నగేష్, వెంకట్ రావ్ గౌడ్, తదితరులు ఉన్నారు.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >