| Daily భారత్
Logo




రెండు గంటల్లోనే దొంగతనం కేసును చేదించిన పోలీసులు : ఇద్దరు నిందుతుల అరెస్ట్.

News

Posted on 2023-11-08 18:25:06

Share: Share


రెండు గంటల్లోనే దొంగతనం కేసును చేదించిన పోలీసులు :  ఇద్దరు నిందుతుల అరెస్ట్.

కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్.

2,30,000/- రూపాయలు, బైక్ స్వాధీనం.

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : దొంగతనం కేసును సిరిసిల్ల పోలీసులు రెండు గంటల్లోనే చేదించారు. కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్ చేసి, వారి వద్ద 2,30,000/- రూపాయలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈమేరకు బుదవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన సిలుముల రాజనర్సు అనే వ్యక్తి మంగళవారం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో తన పెన్షన్ డబ్బులు 2,30,000/- రూపాయలు వేయడానికి నడుచుకుంటూ నటరాజ్ థియేటర్ దారిగుండ వెళ్ళే క్రమంలో పట్టణంలోని సుభాష్ నగర్ కవ్వంపెళ్ళి హరీష్, శాప అరవింధ్ ఇద్దరు బైక్ మీద వచ్చి, బండి వెనకాల కూర్చున్న ఒకరు బండి దిగి రాజనర్సు కొట్టి డబ్బులను లాక్కొని బండిపై పారిపోయినారని సిలుముల శంకర్ నారయణ ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే స్పందించిన సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి.ఉపేందర్ తన క్రైమ్ టీమ్ సిబ్బంది, సి‌సి‌ఎస్ సిఐ రవీందర్, సిబ్బందితో కలిసి రెండు గంటల వ్యవదిలోనే సిరిసిల్లాలోని సుభాష్ నగర్ వాటర్ టాంక్ వద్ద పట్టుకొని, నిందితుల నుండి దొంగిలించిన  2,30,000/- రూపాయలు, మోటార్ సైకల్ ని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ చెప్పారు. దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహరించి రెండు గంటల్లో నిధుతులను పట్టుకున్న టౌన్ సిఐ ఉపేందర్, టాస్క్ఫోర్స్ సిఐ రవీందర్, సిబ్బంది పుల్కమ్ శ్రీనివాస్, శ్రీకాంత్, ఆక్సర్, తిరుపతి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సిఐ ఉపేందర్, సిబ్బంది శ్రీనివాస్, శ్రీకాంత్, గోపాల్, నాగరాజు ఉన్నారు.

Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >