Posted on 2023-10-26 20:28:00
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా( ఫ్లాగ్ డే) గురువారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిధిగా హాజరై పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, పోలీస్ స్టేషన్ల పరిధిలో గత మూడు రోజుల నుండి ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అవగాహన నిర్వహించడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. సమాజ రక్షణ వీరులు నిరంతర ధీరులు ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు, ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది తలసేమియా, సికిల్ సెల్ అనీమియా మరియు డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది,జిల్లాలోని యువకులు, బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. సిరిసిల్ల,కరీంనగర్,మంచిర్యాల జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా చక్కగా సహకరించారన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి ఉచ్చగంగా పాల్గొనడం అభినందించ దగ్గ విషయమని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు ఉపేందర్, సధన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్,కిరణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బంది, యువకులు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అద్యక్షులు గుడ్ల రవి ,వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్ ,కరీంనగర్ అధ్యక్షులు కేశవరెడ్డి, మంచిర్యాల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >