Posted on 2026-07-27 08:16:22
కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం... బీజేవైఎం నాయకులని అదుపులోకి తీసుకున్న పోలీసులు
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో "ఇందిరమ్మ ఇండ్ల" పేరుతో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.
బాధితులు నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ స్పందించారు. బిఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడంతో కేసు నమోదైంది. ఈ ఘటన సిరిసిల్లలో సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడాన్ని బీజేవైఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. "కౌన్సిలర్ కు ఓటేస్తే తనకు వేసినట్టే" అని గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఉదంతంపై ఆయన మౌనాన్ని నిరసిస్తూ కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ పిలుపు నేపథ్యంలో సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్యాలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేవైఎం నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నిరసనల తో సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >