సంచలనం సృష్టించిన సూసైడ్ నోట్..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామంలో గురువారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిట్లా వంశీ (25) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..
నా చావుకు పీఎం మోదీ కారణం: సూసైడ్ నోట్ లభ్యం..
ఘటనా స్థలంలో మృతుడు రాసినట్లుగా ఉన్న ఓ లేఖ సూసైడ్ నోట్ లభించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. "నా చావుకు పీఎం మోదీ కారణం.. అంతే కానీ నా చావుకి, నా ఫ్యామిలీకి సంబంధం లేదు. దయచేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు.. నా అంత్యక్రియలు ఆనవాయితీగా జరిపించండి.. ఇట్లు భారత పౌరుడు, THANK U GOVT" అని ఆ లేఖలో పేర్కొన్నట్లు ఉంది..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అన్ని కోణాలలోనూ విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.