Posted on 2026-07-23 12:58:50
డైలీ భారత్, భువనేశ్వర్: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం ఓ పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరాడక మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని దేంకానాల్ ఆసుపత్రికి తరలించారు. మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ సాహులుగా గుర్తించారు. బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై, స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మరోవైపు కేంఝర్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అస్వస్థతకు గురైన తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >