| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

సీసీ కెమెరాలు, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన

పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని గ్రామస్తులకు పిలుపు

డైలీ భారత్, కామారెడ్డి: ఈ రోజు ఉదయం ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సందర్శించి గ్రామస్తులతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, నేరస్థుల గుర్తింపు, దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని వివరించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు.

అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మాదక ద్రవ్యాలు, గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

గ్రామస్తులు ఈ అవగాహన కార్యక్రమాన్ని అభినందిస్తూ, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణలో పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్‌హెచ్‌ఓ రాజు, పోలీసు సిబ్బంది మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Previous సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Next సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
ADVERTISEMENT