| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా

సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా

పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయంతో పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 1098 హెల్ప్ లైన్ ద్వారా వెలుగులోకి వచ్చిన కేసులో కోర్టు కీలక తీర్పు.

పోలీసు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతోనే నేరస్తులకు శిక్షలు పడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది.

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సిరిసిల్ల బి.వై నగర్ కు చెందిన వేముల శ్రీనివాస్ కు కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించారు.

చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం రావడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి టౌన్ ఎస్.ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.

అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు బృందం 8 మంది సాక్షులను కోర్టు ముందుంచింది. ప్రాసిక్యూటర్ రజినీకాంత్ సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో శాస్త్రీయ ఆధారాల ఆధారంగా నేరం రుజువైంది.

ఈ కేసులో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు. "మైనర్లపై నేరాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించం. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.


#Sircilla #POCSO #TelanganaPolice #ChildSafety #1098 #CourtVerdict

Previous నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Next తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
ADVERTISEMENT