| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డు అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించిన ఆమె, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక సంఘం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో ఈ సమస్యను ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్ రావు ప్రత్యేక నిధుల నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో పనులు చేపట్టలేకపోయామని, ప్రస్తుతం రోడ్డు పొడవు పెరగడంతో అదనపు వ్యయం అవసరమైందని చెప్పారు. అందువల్ల మున్సిపల్ జనరల్ నిధుల నుంచి మరో రూ.3 లక్షలు కేటాయించి, మొత్తం రూ.9 లక్షల వ్యయంతో రహదారిని పూర్తిస్థాయిలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వార్డుల్లో రోడ్లు, మురుగు కాలువలు వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధే తమ పాలన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖాదిర్ పాషా, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, డి.ఈ. వాణి, ఏ.ఈ. నరసింహస్వామి, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


#RajannaSircilla #Sircilla #Municipality #CCRoad

Previous తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Next జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
ADVERTISEMENT