| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభించబడిన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ బ్రాంచ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరావు సిద్దిపేట బ్రాంచ్ మేనేజర్ నవీన్ గౌడ్ తో పాటు కామారెడ్డి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రాకేష్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం  స్థానిక గౌడ్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో వారు మాట్లాడుతూ పలువురికి ఉద్యోగ వ్యాపార అవకాశాల నిమిత్తం ఇన్సూరెన్స్ కంపెనీని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఉద్యోగ అవకాశాల ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా ఏ విధంగా చేసుకుంటే లాభం అవుతుందని వారికి అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో కామారెడ్డి జిల్లాలోని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 300 మంది ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. అనంతరం వారికి భోజన సౌకర్యాలు కల్పించారు.

Previous ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
Next ప్రియుడితో కలిసి.. భర్త తల నరికి దారుణ హత్య
ADVERTISEMENT