Posted on 2026-07-19 05:13:05
BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, మనుబోతులపాడు పంచాయతీ వేములూరు గ్రామంలో పోడు భూముల సాగులో ఉన్న ఆదివాసీలపై అటవీ అధికారులు జరిపిన దాడులు, దౌర్జన్యం అత్యంత దుర్మార్గమైనవని BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్రంగా ఖండించారు గత 30 సంవత్సరాల నుండిఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న దాదాపు 35 హెక్టార్ల పోడు భూమిని అటవీ అధికారులు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. అధికారుల విచక్షణారహిత పోడు మహిళా రైతులపై దాడి వల్ల ఆరుగురు ఆదివాసి మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేసిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ మరియు అత్యాచార కేసులు నమోదు చేయాలన్నారు.ఆదివాసుల భూములను లాక్కోవాలని చూస్తే BRS పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు చూస్తూ ఊరు కోము అని, జిల్లాలో ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన అండగా నిలబడతామని స్పష్టం చేశారు. వేములూరు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సర్వేలు పూర్తి చేసి పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ప్రత్యేక చొరవ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఆదివాసులకు న్యాయం చేయాలని లేనియెడల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పక్షాన బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >