Posted on 2026-06-05 17:23:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నగర్ లోని కార్మికులకు మద్యపాన వ్యసన నిర్మూలనపై ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కౌన్సెలింగ్ నిర్వహించి కార్మికులకు మద్యపాన వ్యసనం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యపానం తాత్కాలిక ఆనందాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలంలో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు ఆర్థిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
మద్యపాన వ్యసనం కారణంగా ఆరోగ్య సమస్యలు, కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, నరాల బలహీనతలు, మానసిక ఆందోళనలు, కుటుంబ కలహాలు మరియు ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా కార్మికులు మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ సంక్షేమానికి కూడా తోడ్పడగలరని చెప్పారు.
మద్యపాన వ్యసనం ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ అని తెలుపుతూ, దీనికి సరైన చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిగా విముక్తి పొందవచ్చని వివరించారు.
మద్యపానం మానేందుకు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మద్యపానం మాన లేము, చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు వంటి అపోహలను విడిచిపెట్టి, వ్యసనం నుండి బయటపడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మద్యపాన వ్యసన విముక్తి పొందాలని అనుకునేవారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత కార్మికులు పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >