| Daily భారత్
Logo




ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

News

Posted on 2026-04-20 15:16:27

Share: Share


ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, నంద్యా తండా ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రారంభమైన సంక్షేమ వారంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS టేకులపల్లి మండలం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, వారికి అందుతున్న సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి రోజువారీ శుభ్రత నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అనంతరం డైనింగ్ హాల్‌ను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండేలా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.

స్టోర్ రూమ్‌లో ఉంచిన కూరగాయలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కూరగాయలను నేలపై ఉంచడంపై వార్డెన్‌ను ప్రశ్నించి వెంటనే ర్యాక్‌లు ఏర్పాటు చేసి శుభ్రంగా నిల్వ చేయాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు.

ఈ పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తాసిల్దార్ వీరభద్రం, ప్రిన్సిపల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

#BhadradriKothagudem #Tekulapalli #EkalavyaSchool #SchoolInspection #MiddayMeal #Hygiene #Telangana

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >