| Daily భారత్
Logo




జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

News

Posted on 2026-04-21 18:28:04

Share: Share


జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

4 మందికి ఒక రోజు జైలు, 4 మందికి రెండు రోజుల జైలు శిక్షలు, మొత్తం ₹75,000/- జరిమానా విధింపు

ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే

క్షణికానందం కోసం సేవించిన మద్యం.. ఒకరి ప్రాణాన్ని తీస్తుంది, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది                జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, ఐపిఎస్  వెల్లడి

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిర్వహిస్తున్న డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 58 మందికి న్యాయస్థానం జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించింది. ఇందులో 4 మందికి ఒక రోజు జైలు శిక్ష, మరో 4 మందికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మొత్తం ₹75,000/- జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

“ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే” అని స్పష్టం చేశారు. ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. “ప్రమాదం ముందస్తుగా చెప్పి రాదు” అనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు.

మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని, క్షణికానందం కోసం చేసే తప్పు కుటుంబాలను చీకటిలోకి నెడుతుందని హెచ్చరించారు. మీ కుటుంబ క్షేమం కోసమైనా మద్యం సేవించి వాహనం నడపవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గారు ప్రజలకు పిలుపునిచ్చారు.

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >