| Daily భారత్
Logo




జర్నలిస్ట్ ఆరోగ్యఆరోగ్య శిబిరం విజయవంతం

News

Posted on 2026-04-20 13:39:01

Share: Share


జర్నలిస్ట్ ఆరోగ్యఆరోగ్య శిబిరం విజయవంతం

జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి........ ప్రముఖ డాక్టర్ శ్రవణ్ కుమార్ 

100 మంది జర్నలిస్టులకు వైద్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ.....

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: ఆదివారం జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ లో జరిగిన శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా   మెగా హెల్త్ క్యాంప్ లో పట్టణంలోని శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ  జర్నలిస్టులో తమ వృత్తిలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తుతం వేసవికాలంలో వడదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యం బాగుంటేనే వార్తల సేకరణకు సాధ్యమవుతుందని మొదటి ప్రాధాన్యత  ఇవ్వాలని ఆయన సూచించారు.  జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఆరోగ్యపరీక్షలు నిర్వహించి  ఉచిత మందులు అందజేయడం పట్ల జర్నలిస్టుల సంఘ నాయకులు ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. జర్నలిస్టులు పని ఒత్తిడి తో ఉన్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ జర్నలిస్టుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించి తన వంతు సహకారంగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను ఇవ్వడం హర్షనీయమన్నారు. వైద్యులకు అన్నివేళలా అండదండలుగా ఉంటూ తమ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు పని భారంతో తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసుకోవద్దని సూచించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమందికి ఇవ్వడం జరిగిందని మళ్లీ కాంగ్రెస్ షబ్బీర్ అలీ సహకారంతో పట్టణ జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించడంతోపాటు ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అదేవిధంగాకృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల సంఘ నాయకులు అందరు కలిసి సమిష్టిగా ప్రభుత్వ నుంచి ఇళ్ల స్థలాలు పొందేందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఎన్ యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రనాథ్, టిడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్, కృష్ణ ఉర్దూ దినపత్రిక సియాసాత్ జావిద్ అలీ, సీనియర్ జర్నలిస్ట్ అరిమిశెట్టి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు కారంగుల అశోక్ రెడ్డి,  సత్యం, కోయల్కర్ కన్నయ్య లక్క పత్ని గంగాధర్, జర్నలిస్టు నాయకులు నక్క సిద్ధిరాములు, సడక్ సునీల్ ఇంజమూరి వెంకటేశ్వర్లు, ముసర్ల శ్రీనివాసరెడ్డి, సంఘ రాజు ముదాం వెంకటేశ్వర్లుముదాం శంకర్, వేల్పుగొండ రాజు, దిశ రాజు, సురేష్, గోవర్ధన్, కౌసర్ శ్రీకాంత్ రెడ్డి, మజీద్ కౌసర్ అలీ అన్వర్ హరీష్, ఇంజమూరు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >