Posted on 2026-04-05 14:54:56
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిధిగా పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వం, న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని, సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
అతని ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తన రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహిస్తూ దేశానికి విశిష్ట సేవలు అందించిన నాయకుడని తెలిపారు.
ఆయన కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని దేశ అభివృద్ధికి దోహదపడ్డారని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ భద్రతను మరింత బలోపేతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే, ఉప ప్రధాని హోదాలో కూడా దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించి ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు. ఆయన జీవితాంతం సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేసిన మహానేతగా నిలిచారని కొనియాడారు.
ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ మధుమెహన్, ఆర్డిఓ ఎన్వి గిరి, మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి, ఎస్సి కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, టీ ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నాగరాజ్,సంఘ సభ్యులు కొత్తపల్లి మల్లన్న, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ పర్కి ప్రేమ్ కుమార్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులుకొత్తోల్ల గంగారం , క్యాథం సిద్దిరములు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు ఎమ్మార్పీఎస్ నాయకులు దుభాసి నరేందర్ బట్ట వెంకట రాములు బట్టంకి బాలరాజు-, శివ రాములు వేముల బలారం బాలమణి, గణేష్ నాయక్-ఎల్ఎచ్ పి ఎస్ సంపత్ గడ్డం బిక్కనుర్ యాదయ్య బోలేశ్వర్--దళిత శక్తి కార్యక్రమ గైని రాజు.సంఘి రాజలింఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అంబేద్కర్ సంఘం ఎర్ర శివరాజ, - మాలమహానాడు రాష్ట్ర నాయకులు రాజ నర్స్, రజక సంఘం అధ్యక్షులుcచాకలి రాజయ్యా - బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల నాగరాజు అధ్యక్షులు, విట్టాల్ ముదిరాజ్, జి వీ ఎం విట్టాల్ బీవీఎం రాష్ట్ర కార్యదర్శి, రాజ్ కుమార్ సాయి గౌతం -జిల్లా ప్రెసిడెంట్ బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ కొంగల వెంకట్, ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, డి ఈ టి ఏ జంగం శ్రీశైలం చిట్యాల సాయన్న పత్రీ అశోక్ – దళిత శక్తి సమన్వయ కర్త .కంకణాల రమేష్- మాలమహానాడు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >