| Daily భారత్
Logo




ప్రజాసేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి

News

Posted on 2026-04-05 14:29:55

Share: Share


ప్రజాసేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి

రామంతపూర్ వెంకట సాయి నగర్‌లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్, వెంకట సాయి నగర్  కాలనీలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, నాయి బ్రాహ్మణ సేవ సంఘం మరియు శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ప్రతినెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమం ఈ నెల 05-04-2026 ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి 11:30 గంటల వరకు విజయవంతంగా జరిగింది. గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత ఔషధాలు, రక్తపరీక్షలు అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

ఈ శిబిరంలో మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించారు. ముఖ్యంగా థైరాయిడ్ పరీక్షలు, షుగర్ టెస్టులు, రక్తపరీక్షలు నిర్వహించారు.

అలాగే గైనకాలజీ స్పెషలిస్ట్ వైద్యులు, ఆర్థోపెడిక్ నిపుణులు, కంటి సంబంధిత ఆఫ్తమాలజీ వైద్యులు పాల్గొని వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

ఈ శిబిరం ద్వారా కాలనీవాసులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా లాభపడుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.

సమాజానికి ఉపయోగపడే ఈ తరహా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానిక ప్రజలు ఆకాంక్షించారు.


Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >