| Daily భారత్
Logo




సుజాతనగర్ మండలంలోఅక్రమ ఇసుక మట్టి దోపిడీఆపాలి

News

Posted on 2026-04-05 09:58:22

Share: Share


సుజాతనగర్ మండలంలోఅక్రమ ఇసుక మట్టి దోపిడీఆపాలి

పాడి పంట రైతుల ఆవేదన

జెసిబి సహాయంతో మట్టి తరలింపు 

ఎదురు మాట్లాడితే బెదిరింపులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో వాగులో ఉన్న అన్ని రేవుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా జెసిబిలతో వాగులోని ఇసుక, మట్టిని భారీగా తవ్వుతూ అక్రమ దందా గా వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతోంది. వాగు సహజ స్వరూపం పూర్తిగా దెబ్బతిని భూగర్భ జలాలు తగ్గిపోతుండగా వర్షాకాలంలో వరదల సమయంలో తీరం కూలిపోవడం వల్ల వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది. వాగు మట్టిని విచక్షణారహితంగా తొలగించడం వల్ల నేల బలహీనమై రైతుల పొలాలు నష్టపోతున్నాయి. బావులు, బోర్లు ఎండిపోవడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా ఏర్పడి లక్షల్లో అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ ఎదురు మాట్లాడిన రైతులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. తెల్లవారుజామున ట్రాక్టర్ల రాకపోకలతో శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలకు నిద్ర లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, రోడ్లు దెబ్బతింటూ దుమ్ము కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ట్రాక్టర్ శబ్దాల కారణంగా పాడి పంటలు పశువులు దెబ్బతింటున్నాయి  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాగులో ప్రమాదకర గుంతలు ఏర్పడి పశువులు పడి మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు, గతంలో ఇదే వాగులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ తవ్వకాలు ఆగకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మరియు సుజాత నగర్ మండల అధికారులు మొద్దు నిద్ర విడనాడి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుని వాగును, రైతుల జీవనోపాధిని రక్షించాలని సుజాతనగర్ మండల  గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >