Posted on 2026-04-05 12:56:11
దేశాభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి: భారతదేశ మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఆదివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర విశిష్టమైందని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం వివిధ కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ దేశాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం పోరాడారని వివరించారు.
సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ కి ఘన నివాళులు అర్పించారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >