Posted on 2026-04-03 12:10:29
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రఖండలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం కేశవాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి పాల్వంచ టౌన్, పాత పాల్వంచ మీదుగా నవభారత్ ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు 15 కిలోమీటర్ల మేర వీర హనుమాన్ విజయ యాత్ర బజరంగ్దళ్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది, శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టితెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ కాషాయ ధ్వజం ఊపి ఈ శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది, అనంతరం ఈ బజరంగ్దళ్ బైక్ ర్యాలీ సి- కాలనీ గేట్, బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ నటరాజ్ సెంటర్, గట్టాయిగూడెం ఆంజనేయ స్వామి వారి ఆలయం, అల్లూరి సెంటర్, శాస్త్రి రోడ్డు, కూరగాయల మార్కెట్, దమ్మపేట సెంటర్, పాత పాల్వంచ ఆంజనేయ స్వామి వారి ఆలయం, రామానంద తీర్థ కాలనీ, సంజయ్ నగర్, నవభారత్ ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన మంత్రి గడిదేశి వెంకటేశ్వర్లు, జిల్లా సంఘటన మంత్రి గంగాధరి సీత, జిల్లా సహా కార్యదర్శి కొమ్ము నరేష్, జిల్లా బజరంగ్దళ్ సహా సంయోజక్ శ్రీరామోజు మధుసూదనా చారి, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు రాపాక రమేష్, విశ్వహిందూ పరిషత్ పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు, పాల్వంచ ప్రఖండ సహ కార్యదర్శి భూక్య మోహన్, ప్రఖండ సహ కార్యదర్శి వేములపల్లి ప్రవీణ్, ప్రఖండ బజరంగ్దళ్ సంయోజక్ రామగిరి ప్రసాద్, ప్రఖండ బజరంగ్దళ్ సహా సంయోజక్ ముదిగొండ కృష్ణమూర్తి, ప్రఖండ బజరంగ్దళ్ సహా సంయోజక్ నిమ్మల వరుణ్, ప్రఖండ బజరంగ్దళ్ గోరక్ష ప్రముఖ్ నూకల సతీష్ కుమార్, ప్రఖండ బజరంగ్దళ్ విద్యార్థి ప్రముఖ గడిదేశి సాయి భరత్, ప్రఖండ బజరంగ్దళ్ సాప్తాహిక్ మిలన్ యాదగిరి, ప్రఖండ మాతృశక్తి సంయోజిక మంద వెంకటరమణ, పట్టణ బజరంగ్ దళ్ సంయోజక్ పొదిల రామకృష్ణ, పట్టణ భజరంగ్దళ్ సహా సంయోజక్ ముదిగొండ నాగేశ్వరరావు, పూసల తండా బజరంగ్దళ్ సంయోజక్ ఆంగోత్ మోహన్, పూసల తండా బజరంగ్దళ్ సహ సంయోజక్ హథిరాం, మంచికంటి నగర్ మాతృశక్తి సంయోజక రమణమ్మ, పాత పాల్వంచ బజరంగ్దళ్ సంయోజక్ తాళ్లూరి వెంకట్, ఆర్ఎస్ఎస్ కళ్లెం వెంకట రెడ్డి, బిజెపి కార్యకర్త గడ్డం అజయ్ మరియు 100 మోటార్ బైకులు 200 మంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, మాతృశక్తి, బిజెపి, హిందుత్వ, ధార్మిక వాదులు పాల్గొనడం జరిగింది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >