Posted on 2026-04-02 17:05:51
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. కానీ కొంతమంది పోలీస్ కేసులు ఉండొచ్చనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఈ భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం “రహ్ వీర్ పథకం”ను అమలు చేస్తోందని తెలిపారు.
ఈపథకం ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యంలో భాగస్వామి కావాలని కోరారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >