| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Devotional

హనుమజ్జయంతి ..

హనుమజ్జయంతి ..

డైలీ భారత్ స్పెషల్: ఆంజనేయస్వామివారి చరిత్రకు ఆధార గ్రంథం పరాశర సంహిత, వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తి, అదృశ్యంతిల కుమారుడే పరాశరుడు. వ్యాసమహర్షికి తండ్రి. ఆయన రచించిన పరాశర సంహితలోని ఆరో పటలంలో హనుమజ్జననాన్ని గురించి వివరణలున్నాయి. అందులో... ఆంజనేయస్వామి వైశాఖ బహుళ దశమి శనివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో వైదృతీయోగంలో మధ్యాహ్న సమయములో కర్కాటక లగ్నంలో కౌండిన్య సగోత్రంలో జన్మించాడు. అంజనాదేవి. వాయుదేవుల కుమారుడైన ఆంజనేయస్వామి వారు జన్మించిన వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి పండుగగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే ఆంజనేయస్వామి జన్మదినాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష పూర్ణిమనాడు ఉత్తర భారతదేశంలో జరుపుకోవడం ఆచారం. ఈ విధంగా ఉత్తరాదివారు హనుమజ్జయంతిగా జరుపుకునే చైత్ర పూర్ణిమను దక్షిణదేశంలో ప్రధానంగా తెలుగువారు హనుమద్విజయోత్సవ దినంగా జరుపుకుంటారు.

Previous మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Next రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
ADVERTISEMENT