Posted on 2026-08-01 05:11:18
డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంబేద్కర్ నగర్, సిరిసిల్లలో హిందీ సాహిత్య జగత్తుకు విశిష్ట సేవలందించిన ఉపన్యాస సమ్రాట్ మున్షీ ప్రేమచంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
హిందీ ఉపాధ్యాయులు పర్కాల రవీందర్ మాట్లాడుతూ, ప్రేమచంద్ తన కథలు, నవలల ద్వారా సమాజంలోని పేదరికం, అసమానతలు, రైతుల జీవన విధానం, సామాజిక న్యాయం వంటి అంశాలను వాస్తవికంగా చిత్రించి హిందీ సాహిత్యానికి చిరస్మరణీయ సేవలందించారని తెలిపారు. ఆయన రచనలు నేటికీ విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రేమచంద్ సాహిత్య స్ఫూర్తిని ప్రతి విద్యార్థి జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
జయంతి సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సామల రాజీవ్, విశ్వతేజ, M. అభిరామ్ లకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి, ఉపాధ్యాయులు పొలాస మల్లేశం, ఐత సత్యనారాయణ, సామాల రమాదేవి, సిరిపురం జ్యోతి, జంగిటి భానుచందర్, చొప్పదండి రమాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >