| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి

లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి

వెంకట సాయి నగర్ కాలనీ ప్రజలకు అండగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్

డైలీ భారత్, రామంతాపూర్: వెంకట సాయి నగర్ కాలనీలో కొన్నేళ్లుగా లో వోల్టేజ్ సమస్య కారణంగా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్ ముందుకు వచ్చారు.

కాలనీలోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆయన, కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మరియు టీం సభ్యులతో కలిసి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ AE కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా AE కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అరుణ్ పటేల్ మాట్లాడుతూ,

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి మార్గదర్శకత్వం, సహకారంతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

వెంకట సాయి నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, నవీన్, విద్యాసాగర్, రమేష్, రాజు , రామకృష్ణ , భూపతి నరసింహ,  శివకుమార్ , రమేష్ యాదవ్ , లక్ష్మణ్,  పరశురాం, ఐలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ
Next కామారెడ్డిలో కొత్త సిఐ బాధ్యతలు
ADVERTISEMENT