డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయంలోని పాత ఛాంబర్‌ను ప్రజల సౌకర్యార్థం మరియు కార్యాలయ అవసరాలకు అనుగుణంగా అన్ని హంగులతో పునరుద్ధరించడం జరిగింది. ఆధునీకరించిన ఈ నూతన ఛాంబర్‌ను ఈరోజు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారికంగా ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు/భాదితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రశాంతమైన మరియు మెరుగైన వాతావరణం ఉండేలా ఈ మరమ్మత్తులు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....
పోలీస్ కార్యాలయాలు ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలని, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అధికారుల పనితీరులో మరింత పారదర్శకత, వేగం పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజలకు చేరువగా ఉంటూ వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఆయన వివరించారు. కార్యాలయ ఆధునీకరణ వల్ల అటు సిబ్బందికి, ఇటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహ రెడ్డి , కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIs), ఎస్‌ఐలు (SIs) మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.