Posted on 2026-04-01 18:25:54
జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఉపాధిహామీ పనులు, కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, తాగు నీటి వసతి ఏర్పాటు చేయాలి.
వేసవి వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేసవి వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ, అగ్ని మాపక శాఖ, అటవీ శాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ వివిధ శాఖల ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ...
ఈ వేసవి కాలంలో వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆశ కార్యకర్త నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఏమైనా మరమ్మత్తు ఉంటే ముందస్తుగానే చేయించాలని ఆదేశించారు. మున్సిపల్, తహసీల్ కార్యాలయాలు, బస్టాండ్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రతి రోజు నీరు త్రాగడం, గొడుగు తీసుకుని బయటికి రావడం, వేడి గాల్పులు వచ్చే సమయంలో ఇంట్లో ఉండటం వంటి వివిధ అంశాలను ప్రజలకు తెలియజే యాలన్నారు. ఉపాధిహామీ పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మూగ జీవాల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాల్లో నీటి తొట్ల నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలపై పశు వైద్య, సంవర్ధక శాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వాటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వైద్యాధికారి రజిత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, డీఆర్డీఓ గీత, మిషన్ భగీరథ అధికారులు అన్వర్, సుమలత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కార్మిక శాఖ అధికారి నజీర్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, పశు సంవర్ధక శాఖా అధికారి రవీందర్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా రవాణాశాఖా అధికారి లక్ష్మణ్ కుమార్, పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >