| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

డైలీ భారత్, చల్లపల్లి: కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఉన్న టపాసులు బయటకు తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో టపాసులు పేలి, ముగ్గురు కానిస్టేబుల్లతో సహా ఎస్ఐ దుర్గా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసు స్టేషన్లో ఉన్న సామాగ్రికి సైతం మంట అంటుకుని పోలీసు వాహనం కూడా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్, ఎస్ఐలను 108 వాహనంతో తొలుత ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం చల్లపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Next మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT