Posted on 2026-03-30 18:01:46
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు.
విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
#Sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >