| Daily భారత్
Logo




గాజువాకలో దారుణ హత్య

News

Posted on 2026-03-30 08:25:11

Share: Share


గాజువాకలో దారుణ హత్య

డైలీ భారత్, గాజువాక: డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ప్రియురాలిని దారుణంగా హత మార్చడంతో పాటు మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసేసిన కిరాతక సంఘటన గాజువాక ఎల్‌వీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఇండియన్‌ నేవీలో ఎయిర్‌ క్రాప్ట్‌ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురం ప్రాంతానికి చెందిన వివాహితరాలు మౌనిక (28)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. రాత్రి వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్టు సమాచారం. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత వారిద్దరి మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగిందని, క్రమేణా అది పెద్దది కావడంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర ఇంట్లో ఉన్న కత్తిలో మౌనికను పొడిచి చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, సగ భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు. అనంతరం నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించి, లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా, తనను మౌనిక డబ్బుకోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించినట్టు సమాచారం. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

Posted On 2026-06-07 13:06:00

Readmore >
Image 1

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-07 13:04:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >