| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పోచారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

 పోచారం పరిధికి చెందిన మనోహర్ యువకుడు ఎయిడ్స్ బాధితుడు. మనోహర్‌తో అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని దాచి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. అయితే ఎయిడ్స్ ఉందని తేలడంతో ఆ పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో సదరు యువతిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి మనోహర్ వెళ్లాడు. తనతో పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తడి చేశాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్షతో తన రక్షంతో కూడిన ఇంజెక్షన్‌ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Previous గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Next రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
ADVERTISEMENT